Nara Lokesh Yuvagalam Padayatra : నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. 2వేల కిలోమీటర్ల మైలురాయికి చేరువలో పాదయాత్ర

సగటున 13.15 కిలో మీటర్లల చొప్పున పాదయాత్ర సాగుతోంది. కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కిలీ మీటర్ల మైలురాయిని చేరుకోనుంది.

Nara Lokesh Yuvagalam Padayatra : నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. 2వేల కిలోమీటర్ల మైలురాయికి చేరువలో పాదయాత్ర

Nara Lokesh (5)

Updated On : July 11, 2023 / 7:45 AM IST

Yuvagalam Padayatra : టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తోన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం 2వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోనుంది. యువగళం పాదయాత్ర 153రోజుల్లో 2వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుని సగ భాగం పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర సాగింది.

సగటున 13.15 కిలో మీటర్లల చొప్పున పాదయాత్ర సాగుతోంది. కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కిలీ మీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఇప్పటి వరకూ దాదాపు 30లక్షలమంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకున్నట్లు అంచనా.

Anam Ramanarayana Reddy : లోకేష్ పాదయాత్రకే వణికిపోతే.. చంద్రబాబు యాత్ర, పవన్ వారాహి యాత్ర చేస్తే ఏం చేస్తారు : ఆనం

53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 49చోట్ల బహిరంగ సభలు, వివిధ వర్గాలతో 118 ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ వివిధ వర్గాల ప్రజల నుంచి 2,895 రాతపూర్వక వినతిపత్రాలు తీసుకున్నారు.