వైసీపీకి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా

వైసీపీకి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.

వైసీపీకి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా

Raghuramakrishna Raju

Updated On : February 24, 2024 / 10:39 AM IST

Raghu Rama Krishna Raju resignation : వైసీపీకి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు రాసిన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

 

గత మూడున్నర సంవత్సరాలుగా నర్సాపురంలో నా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికోసం కృషి చేశానని తెలిపారు. ప్రజా శ్రేయస్సుకోసం సేవ చేయాలనే నా దృఢ నిశ్చయానికి గుర్తుగా, వైఎస్ఆర్సీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నట్లు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు  సీఎం జగన్ కు రాసిన లేఖలో తెలిపారు. వెంటనే నా రాజీనామాను మీరు ఆమోదించాలని ఆశిస్తున్నానని అన్నారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి, అది మన ఇద్దరికీ ఉన్న అసంబద్ధమైన అనుబంధం నుంచి ఒక్కసారైనా విముక్తి చేస్తుందని రఘురామ కృష్ణ రాజు వ్యాఖ్యానించారు.