జర్నలిస్టు కృష్ణంరాజు కామెంట్లను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. నారా లోకేశ్ స్పందన

అమరావతి పోరాటానికి మహిళలు వెన్నెముక అని, తాము వారికి అండగా నిలుస్తామని తెలిపారు.

జర్నలిస్టు కృష్ణంరాజు కామెంట్లను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. నారా లోకేశ్ స్పందన

Nara Lokesh

Updated On : June 10, 2025 / 6:23 PM IST

జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుని, ఆ కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పింది. ఏపీ డీజీపీకి లేఖ రాస్తూ.. ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషంపై మూడు రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని చెప్పింది. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌ డిటేల్‌లో అమరావతి మహిళలను ఉద్దేశించి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఏపీలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

Also Read: వివాదం తర్వాత మాల్దీవ్స్ ఎత్తుగడ.. మాల్దీవ్స్ కొత్త అంబాసిడర్‌గా కత్రినా కైఫ్.. ఆమెనే ఎందుకు నియమించింది?

కాగా, అమరావతిలోని మహిళలను లక్ష్యంగా చేసుకుని జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై వేగంగా, నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకున్న జాతీయ మహిళ కమిషన్‌కు అభినందనలు అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మహిళా రైతులను అనుచిత వ్యాఖ్యతో పిలవడం సిగ్గుచేటు మాత్రమే కాదని, ఇది వారి త్యాగాలకు జరిగిన ఘోర అవమానమని చెప్పారు.

మహిళ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు బలమైన సందేశాన్ని పంపుతాయని లోకేశ్ తెలిపారు. ఏపీలో మహిళలపై ద్వేషాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని చెప్పారు. అమరావతి పోరాటానికి మహిళలు వెన్నెముక అని, తాము వారికి అండగా నిలుస్తామని తెలిపారు. న్యాయం త్వరగా అందాలని అన్నారు.