New Strain News : ఏపీని హడలెత్తించిన న్యూ స్ట్రెయిన్ న్యూస్..
ఏపీలో కరోనా మహమ్మారి పొలిటికల్ హీట్ పుట్టించింది. కరోనా న్యూ స్ట్రెయిన్ N 440K ఏపీలోకి ప్రవేశించిందని అందువల్లే కొత్త కరోనా కేసులు, మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయనే వార్త..

New Strain News To Scared Andhra Pradesh People Covid Cases Surge
New Strain News in AP : ఏపీలో కరోనా మహమ్మారి పొలిటికల్ హీట్ పుట్టించింది. కరోనా న్యూ స్ట్రెయిన్ N 440K ఏపీలోకి ప్రవేశించిందని అందువల్లే కొత్త కరోనా కేసులు, మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే బెడ్లు, ఆక్సిజన్ కొరతతో బెంబేలెత్తున్న ప్రజలకు న్యూ స్ట్రెయిన్ వార్త షాక్ ఇచ్చింది. అయితే చంద్రబాబు ఆరోపణలను కొట్టిపడేశారు వైద్యాధికారులు.
ఏపీలో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ఏమీ లేదంటూ స్పష్టం చేశారు ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్. N 440K వైరస్‌ని సీసీఎంబీ శాస్త్రవేత్తల బృందం 2020
జులైలోనే ఏపీలో గుర్తించిందన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ… దానికి కొత్త స్ట్రెయిన్ కారణం కాదన్నారు. ఏపీలో కొత్త రకం కరోనా
స్ట్రెయిన్ కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని ప్రచారం చేయడం సరికాదన్నారు అశోక్ సింఘాల్.
ఏపీలో కొత్త స్ట్రెయిన్ ఉన్నట్టు ఇప్పటి వరకు సీసీఎంబీ వంటి సంస్థలు గుర్తించలేదన్నారు. ఇటు చంద్రబాబు వ్యాఖ్యలతో విబేధించారు కర్నూలు మెడికల్ కాలేజీ VRDL లాబ్ స్పెషలిస్ట్ రోజారాణి. దేశంలోనే మొదటిసారిగా N440K రకం స్ట్రెయిన్‌ను తాము గతేడాది జూన్‌లో కనుగొన్నట్టు చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజీలో VRDL, CSIR, IGIB సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించామన్నారు. సెకండ్ వేవ్ కంటే ముందే ఈ స్ట్రెయిన్ ఏపీలో ఉందన్నారు.