ఏపీలో కొత్తగా 1,392 కరోనా కేసులు

AP corona cases : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1392 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 61,050 సాంపిల్స్ పరీక్షించగా 1392 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఒక్క రోజులో కరోనాతో 11 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒక్కరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,44,359కు చేరింది. ఇప్పటిరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,802కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1549 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 21,235 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు వరకు రాష్ట్రంలో 87,25,025 సాంపిల్స్ పరీక్షించారు.