NIA-Maoist Gajarla Ravi : మావోయిస్టు గాజర్ల రవిని పట్టిస్తే రూ.10లక్షలు బహుమతి : NIA ప్రకటన

 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవిపై కేంద్రం దర్యాప్తు సంస్థ NIA ఫోకస్ పెట్టింది. గాజర్ల రవిని పట్టిస్తే రూ.10లక్షలు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. గాజర్ల రవి మావోయిస్టు కీలక వ్యక్తి అని అతనిని పట్టిస్తే రూ.10లక్షల రివార్డు ఇస్తామని ఎన్‌ఐఏ పోస్టర్లు ఏర్పాటు చేసింది

NIA-Maoist Gajarla Ravi : మావోయిస్టు గాజర్ల రవిని పట్టిస్తే రూ.10లక్షలు బహుమతి : NIA ప్రకటన

NIA Reward announce On Maoist Gajarla Ravi

Updated On : January 25, 2023 / 10:27 AM IST

NIA Reward announce Maoist Gajarla Ravi : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవిపై కేంద్రం దర్యాప్తు సంస్థ NIA ఫోకస్ పెట్టింది. గాజర్ల రవిని పట్టిస్తే రూ.10లక్షలు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. గాజర్ల రవి మావోయిస్టు కీలక వ్యక్తి అని అతనిని పట్టిస్తే రూ.10లక్షల రివార్డు ఇస్తామనిఒడిశాలో ఎన్‌ఐఏ పోస్టర్లు ఏర్పాటు చేసింది. రవితో పాటు మరో ముగ్గురు మావోయిస్టులపై కూడా NIA ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా గాజర్ల రవి అలియాస్ గణేస్ పై. ఇంతకీ ఎవరా రవి? అతని నేపథ్యం ఏంటీ?ఏకంగా NIA టార్గెట్ చేసింది అంటే రవి మావోయిస్టు ఉద్యమంలో ఎంత కీలక వ్యక్తి అనేది అర్థం చేసుకోవచ్చు.

1992లో నక్సల్స్ ఉద్యమంలో చేరిన రవి అలియాస్ గణేష్ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థానానికి చేరుకున్నారు. 2004లో అప్పటి పీపుల్స్ వార్ ప్రతినిధిగా ప్రభుత్వంతో రవి చర్చల్లో పాల్గొన్న రవి అలియాస్ గణేష్ 23 ఏళ్ల నవ యవ్వనంలోనే సాయుధ బాటపట్టిన రవిపై మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ పై భారీ రివార్డు ప్రకటించింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఒడిశాలో NIA పోస్టర్లు ఏర్పాటు చేసింది. గాజర్ల రవిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన NIA తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జాలమూరి శ్రీను, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరు జోగా అలియాస్ టెక్ శంకర్‌లపై కూడా రూ.5 లక్షలు, మల్కన్‌గిరికి చెందిన చంటిలపై రూ.2 లక్షల రివార్డులు ప్రకటించింది.

ఈ నలుగురిలో ఇద్దరు ఏపీ-ఒడిశా సరిహద్దులో ప్రత్యేక జోనల్ కమిటీలో కార్యకలాపాలు సాగిస్తుండగా.. గాజర్ల రవి ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సరిహద్దుల్లోని ఏవోబీఎస్‌జడ్‌సీ ట్రై జంక్షన్ కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దట్టమైన ఈ అడవి ప్రాంతంలో గాజర్ల రవికి మంచి పట్టు ఉందని NIA గుర్తించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం వెలిశాలకు చెందిన గాజర్ల రవిని పట్టుకునేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తుండగా.. అతడి ఆచూకీ ఏమాత్రం చిక్కటంలేదు.

2012లో ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్ల మృతి చెందారు. ఈ కాల్పుల్లో గాజర్ల రవిని ప్రధాన నిందితుడిగా ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఈ కేసును మల్కాన్‌గిరి పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తరువాత ఈ కేసు ఎన్‌ఐఏకు చేరింది. దీంతో ఎన్‌ఐఏ గాజర్ల రవిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగానే గాజర్ల రవి ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్‌ఐఏ రివార్డు కూడా ప్రకటించింది. అతని ఆచూకీ చెబితే చాలు మిగిలిన ఆపరేషన్ అంతా తాము చూసుకుంటామని చెబుతోంది.