Maoist RK’s Wife House : మావోయిస్టు ఆర్కే భార్య నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు..తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన అధికారులు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య నివాసంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాయి. టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఉన్న ఆర్కే భార్య శిరీష్ ఇంటికి వెళ్లిన ఎన్‌ఐఏ బృందాలు గంట నుంచి సోదాలు నిర్వహిస్తున్నాయి.

Maoist RK’s Wife House : మావోయిస్టు ఆర్కే భార్య నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు..తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన అధికారులు

Nia Search

Updated On : July 19, 2022 / 2:08 PM IST

Maoist RK’s Wife House : మావోయిస్టు కుటుంబ సభ్యులు, విరసం నేతలే టార్గెట్‌గా ప్రకాశం జిల్లాలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ… NIA సోదాలు నిర్వహిస్తోంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య నివాసంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాయి. టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఉన్న ఆర్కే భార్య శిరీష్ ఇంటికి వెళ్లిన ఎన్‌ఐఏ బృందాలు గంట నుంచి సోదాలు నిర్వహిస్తున్నాయి.

ఆ సమయంలో శిరీష విజయవాడలో ఉన్నారు. దీంతో అధికారులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలకు వెళ్లారు. విషయం తెలుసుకున్న శిరీష విజయవాడ సొంతూరు బయలుదేరారు.

Maoist Leader RK : నా భర్త జ్ఞాపకాలతో పుస్తకాన్ని తేవాలనుకున్నా.. పోలీసులు అడ్డుకున్నారు : మావోయిస్టు నేత ఆర్కే సతీమణి

మరోవైపు విరసం నేత కల్యాణ్‌ రావు ఇంట్లోనూ ఎన్‌ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. విజయవాడలోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. విరసం నేత దొడ్డి ప్రభాకర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.