ఇరిగేషన్‌ను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారు: మంత్రి నిమ్మల రామానాయుడు

కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమ రతనాల సీమగా మారనుందని తెలిపారు.

ఇరిగేషన్‌ను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారు: మంత్రి నిమ్మల రామానాయుడు

Minister Nimmala ramanaidu

Updated On : December 22, 2024 / 2:29 PM IST

కడప జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. గండికోటలో ఏర్పాటు చేయబోయే అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమ రతనాల సీమగా మారనుందని తెలిపారు. ఇరిగేషన్‌ను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని చెప్పారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఎన్నికల సమయంలో జగన్ అబద్ధపు హామీలు ఇచ్చారని విమర్శించారు.

ప్రభుత్వ దృష్టికి ముంపు బాధితుల సమస్యలు తీసుకెళ్తానని నిమ్మల రామానాయుడు అన్నారు. డిస్ట్రిబ్యూటరి కెనల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలో హంద్రీనీవా గాలేరు సుజల స్రవంతి పెండింగ్ పనులు పూర్తవుతాయని తెలిపారు.

పెన్నా, గోదావరిని అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇరిగేషన్‌కు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఏటా లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర పాలవుతుందని చెప్పారు.

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో పెద్ద హీరోలు, నిర్మాతలకు షాక్..