Nori Dattatreyudu : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నోరి నియామకం

రేడియేషన్‌ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఏపీ పరిపాలన శాఖ కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

Nori Dattatreyudu : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నోరి నియామకం

Nori Dattatreyudu

Updated On : October 1, 2021 / 11:17 AM IST

Nori Dattatreyudu : రేడియేషన్‌ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణ)గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞుడిగా డాక్టర్ నోరి పేరుగాంచారు. గత మంగళవారం ముఖ్యమంత్రి జగన్ తో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు భేటీ అయ్యారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సీఎంతో సుదీర్ఘంగా చర్చించారు.

Read More : Kiran Kumar Reddy : మోసగాడు చిక్కాడు.. తిరుపతిలో పట్టుకున్న తెలంగాణ పోలీసులు

రేడియేషన్‌ ఆంకాలజీలో దేశంలో డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడుకు 43 ఏళ్ల అనుభవం ఉంది. బ్రెస్ట్‌ సెంటర్, గైనకాలజిక్‌ ఆంకాలజీ, హెడ్, మెడ, న్యూరో ఆంకాలజీ, థొరాసిక్‌ ప్రోగ్రాంల కోసం కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్‌లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఆయన సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.

Read More : Allu Ramalingayya : అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరించిన వారసులు..