Tirupati : తిరుపతిలో కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు.. రిబ్బన్ కటింగ్ చేసిన మంత్రి రోజా
జబర్దస్త్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారంలో బిజీ అయిపోయారు. లాభాలు బాగా గడిస్తుండటంతో వరుస బ్రాంచ్‌లను ఓపెన్ చేస్తున్నారు. తాజాగా తిరుపతి బ్రాంచ్‌ను మంత్రి రోజా ప్రారంభించారు.

Tirupati
Tirupati : జబర్దస్త్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారంలో బిజీ అయిపోయారు. నెల్లూరు, హైదరాబాద్ తర్వాత తాజాగా తిరుపతిలో ఆయన తన హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మంత్రి రోజా తిరుపతిలోని ఐదు అవుట్ లెట్స్‌కు రిబ్బన్ కట్ చేసారు.
జబర్దస్త్ ఆర్పీ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. గతంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో నెల్లూరులో పెట్టిన కర్రీ పాయింట్ సక్సెస్ అయ్యింది. నెల్లూరు నుంచి కొంతమంది మహిళలను తీసుకువచ్చి, వారికి ఆశ్రయం కూడా ఇచ్చి కట్టెల పొయ్యి మీద రకరకాల చేపల వంటకాలు, పులుసులు తయారు చేయడం మొదలుపెట్టారు ఆర్పీ. ఆయన వంటకాలకు జనాలు ఎగబడటంతో బాగానే లాభాలు గడించారు. మరిన్ని కర్రీ పాయింట్లు ఓపెన్ చేస్తామని చెప్పిన ఆర్పీ హైదరాబాద్ కూకట్‌పల్లిలో తన బ్రాంచ్‌ను ప్రారంభించారు. రకరకాల చేపల పులుసులు రుచికరంగా ఉండటంతో జనం క్యూ కట్టారు.
Jabardasth Rakesh : జబర్దస్త్ రాకేష్ కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్.. పాపం రాకింగ్ రాకేష్ పరిస్థితి..
తాజాగా కిరాక్ ఆర్పీ తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఐదు బ్రాంచ్‌లను మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటి మెహరీన్, డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా ఆర్పీకి అభినందనలు తెలిపారు. రుచితో పాటు శుచిగా ఉండే ప్రత్యేక ఫార్ములాతో, చేయి తిరిగిన మాస్టర్లతో ఇక్కడ వంటకాలు అందిస్తున్నామని ఆర్పీ చెప్పారు. త్వరలో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఫ్రాంచైజీలను అందిస్తున్నట్లు ఆర్పీ అన్నారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అవుట్‌లెట్లలో సన్న చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, తలకాయ పులుసు, రవ్వ చేపల పులుసు అందుబాటులో ఉంటాయట.
View this post on Instagram
View this post on Instagram