Corona Positive : అమానుషం – పాజిటివ్ వచ్చిన వారి ఫ్లాట్ కు తాళం వేసిన ఎదురింటి వ్యక్తి

Corona Positive : అమానుషం – పాజిటివ్ వచ్చిన వారి ఫ్లాట్ కు తాళం వేసిన ఎదురింటి వ్యక్తి

Corona Positive

Updated On : April 20, 2021 / 3:47 PM IST

Opposite apartment owner who locked the apartment said Corona got positive : నెల్లూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని భార్యా భర్తలను అపార్ట్ మెంట్ లో ఉంచి తాళం వేసాడు ఎదురింటి ఫ్లాట్ ఓనర్.

నెల్లూరులోని నవాబ్ పేటలోని ఎంఆర్ఎం రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ లోని ఒక ప్లాట్ లో నివసించే భార్యా భర్తలకు 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి వారు హోం క్వారంటైన్ లో ఉండి డాక్టర్లు సూచనల మేరకు మందులు వాడుతున్నారు.

సోమవారం రాత్రి భర్తకు దగ్గు రావటంతో బయటకు వెళ్లి దగ్గు మందు తెచ్చుకుని ఇంటికి వచ్చాడు. ఇది తెలుసుకున్న ఎదురింటి ఫ్లాట్ ఓనర్ దంపతులు బయటకు రాకుండా వారింటికి తాళంవేసి వారిని నిర్భందించాడు. దీంతోవారు మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.

అపార్ట్ మెంట్ కు చేరుకున్న మీడియా ప్రతినిధులతో ఎదురింటి ఫ్లాట్ ఓనర్లు గొడవ పడ్డారు. కరోనా పాజిటివ్ బాధితులకు మీరు అండగా రావడం ఏంటని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.