ఏపీలో పాకిస్థాన్ కాలనీ.. ఇప్పుడు పేరు మార్చి భగీరథ కాలనీ అయింది.. దాని విశేషాలు..

విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్ పరిధిలో పాకిస్థాన్ కాలనీ ఉంది.

ఏపీలో పాకిస్థాన్ కాలనీ.. ఇప్పుడు పేరు మార్చి భగీరథ కాలనీ అయింది.. దాని విశేషాలు..

Pakistan Colony in Vijayawada

Updated On : May 8, 2025 / 11:16 AM IST

Vijayawada: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి సమయంలో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. 80మందికిపైగా ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు. దీంతో పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో విజయవాడలోని పాకిస్థాన్ కాలనీ పేరు చర్చనీయాంశం అవుతోంది. అయితే, ఉగ్రదాడికి ఈ కాలనీకి సంబంధం లేదు.. కానీ, గత కొన్నేళ్లుగా ఈ పేరుతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు బహవల్‌పూర్ ఉగ్రవాద స్థావరం ఎలా మారిందో చూడండి.. వీడియో వైరల్

పాకిస్థాన్ కాలనీ ఎప్పుడు ఏర్పడింది..?
విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్ పరిధిలో పాకిస్థాన్ కాలనీ ఉంది. ఇక్కడి ప్రజలు ఆధార్, పాన్, రేషన్ కార్డు సహా అన్ని సర్టిఫికెట్లలోనూ వారి చిరుమానా పాకిస్థాన్ కాలనీ, బెజవాడగా నమోదవుతుంది. ఈ పాకిస్థాన్ కాలనీ 1980లో ఏర్పడింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు ఇక్కడ ఉండటంతో ఈ ప్రాంతానికి పాకిస్థాన్ కాలనీగా పేరు పెట్టారు. ప్రస్తుతం ఇక్కడ శరణార్థులు ఎవరూ లేరు. పాకిస్థాన్ నుంచి వచ్చిన వాళ్లు కొంతకాలమే ఇక్కడున్నారు. వరదలు వచ్చిన సమయంలో, ఆ తరువాత వారంతా వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ శరణార్థుల కోసం బర్మా కాలనీ కట్టినట్టు విజయవాడలోని చాలా మందికి తెలుసు.. కానీ, పాకిస్థాన్ కాలనీ గురించి చాలా మందికి తెలియదు.

Also Read: ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం ప్రెస్‌మీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు మామూలోళ్లు కాదు.. వాళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే..

పాకిస్థాన్ పేరుతో స్థానికుల ఇబ్బందులు..
ఇక్కడ నివసించే వారి సర్టిఫికెట్లు, ఆధార్, పాన్, ఇతర కార్డుల్లో పాకిస్థాన్ అని ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మంది ఉద్యోగాలను పొందలేక పోతున్నారు. ఇక్కడి యువకులు ఉద్యోగాలకోసం ఇంటర్వ్యూలకు వెళ్లిన సమయంలో ఈ పేరు వల్ల ఒకింత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీంతో కాలనీ వాసులంతా కాలనీ పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు. భగరీథ కాలనీగా మార్చాలని నిర్ణయించారు. ఆ తరువాత ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పాకిస్థాన్ కాలనీని భగీరథ కాలనీగా మార్చేందుకు స్థానికులు చర్యలు చేపట్టారు.