చంద్రబాబు సమక్షంలో పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత కీలక భేటీ

తానే హోం మంత్రి పదవి తీసుకోవలసి వస్తుందంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు సమక్షంలో పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత కీలక భేటీ

Updated On : November 7, 2024 / 4:12 PM IST

అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత సమావేశమయ్యారు. హోం మంత్రి అనితపై ఇటీవల పవన్ కల్యాణ్ పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో శాంతి, భద్రతలపై ప్రశ్నిస్తూ… హోంమంత్రి రివ్యూ చేయాలని ప్రజల మధ్యలో పవన్ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, పోలీసు రియాక్షన్ పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. అలాగే, పవన్ కల్యాణ్‌పై మంద కృష్ణ మాదిగ కూడా పలు వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యం సీఎంతో పవన్, అనిత భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తానే హోం మంత్రి పదవి తీసుకోవలసి వస్తుందంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరినీ చంద్రబాబు నాయుడు సమావేశపరచారు.

YS Jagan: సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: వైఎస్‌ జగన్ ఆగ్రహం