Pawan Kalyan: చాలా బెదిరింపులు వస్తున్నాయి: పవన్ కల్యాణ్ కామెంట్స్
వైసీపీ వారు 100కి పైగా ఉన్నారు కాబట్టి వారు కౌరవులేనని అన్నారు. వారు ఓడిపోవడం..

Pawan Kalyan
Pawan Kalyan: యుద్ధ రంగం నుంచి పారిపోవాలంటూ తనకు చాలా బెదిరింపులు వస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ ఇవాళ వారాహి యాత్రలో మాట్లాడారు. ఈ పదేళ్లలో తమ పార్టీ అనేక ఎదురుదెబ్బలు తిందని చెప్పారు.
రూ.లక్ష కోట్లు, కిరాయి సైన్యం, పోలీస్ శాఖ వారి దగ్గర ఉందని అన్నారు. తమ దగ్గర ఒక మైక్ తప్ప ఏముందని నిలదీశారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా తాను చెబుతున్నానని, ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తీరుస్తానని తెలిపారు. పదేళ్లలో చాలా దెబ్బలు తిన్నానని, ఆశయాలు, విలువలకోసం పార్టీ నడిపేవాడ్ని కాబట్టే నిలబడి ఉన్నానని తెలిపారు.
జనసైనికులకు, తెలుగుతమ్ముళ్లకు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. వైసీపీ వారు 100కి పైగా ఉన్నారు కాబట్టి వారు కౌరవులేనని అన్నారు. వారు ఓడిపోవడం, తాము అధికారంలోకి రావడం డబుల్ ఖాయమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రానికి అవనిగడ్డ డీఎస్సీ శిక్షణలో ఆయువుపట్టు అని అన్నారు. రాష్ట్రంలో 30 వేల పైచికులు డీఎస్సీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 2018 నుంచి ఉద్యోగాలు లేవని అన్నారు. మెగా డీఎస్పీ ఇస్తానని జగన్ పాదయాత్రలో చెప్పారని గుర్తు చేశారు.
అందుకే టీడీపీతో కలిశా..
తాను 2014లో బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చిన తరవాత కొన్ని హామీల విషయంలో, ప్రత్యేక హోదా అమలు చెయ్యకపోతే, తాను వారితో విభేదించి బయటకు వచ్చానని గుర్తు చేశారు. తాను ప్రజా సమస్యలపై, ఇచ్చిన హామీల పట్ల అంత నిబద్ధతగా ఉంటానని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేక పరిస్థితుల్లో మళ్లీ టీడీపీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు.
ఈ సారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పారు. జగన్ ను అధికారంలోంచి దించేయడమే జనసేన లక్ష్యమని అన్నారు. జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని తెలిపారు.