Karumuri Nageswara Rao : బాంబ్ బ్లాస్ట్ ఘటనలో చంద్రబాబుని కాపాడింది ఆమే, పవన్ కల్యాణ్ తెలుసుకో- మంత్రి కారుమూరి హాట్ కామెంట్స్

సీఐ అంజూ యాదవ్ నిజాయితీ గల అధికారి అని మంత్రి కారుమూరి అన్నారు. అసలు అంజూ యాదవ్ గురించి పవన్ కల్యాణ్ కు తెలుసా అని అడిగారు.(Karumuri Nageswara Rao)

Karumuri Nageswara Rao : బాంబ్ బ్లాస్ట్ ఘటనలో చంద్రబాబుని కాపాడింది ఆమే, పవన్ కల్యాణ్ తెలుసుకో- మంత్రి కారుమూరి హాట్ కామెంట్స్

Karumuri Venkata Nageswara Rao(Photo : Google)

Updated On : July 17, 2023 / 6:04 PM IST

Karumuri Nageswara Rao – Pawan Kalyan: ఏపీ మంత్రులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ విషయంలో వైసీపీ, పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. సీఐ వ్యవహారంలో పవన్ తీరుని వైసీపీ నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మహిళా సీఐపై పవన్ కల్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తున్నారు. పవన్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు.

Also Read..New Ration Cards : ఏపీ ప్రభుత్వం శుభవార్త.. కొత్తగా 1.67 లక్షల రేషన్ కార్డులు

సీఐ అంజూ యాదవ్ నిజాయితీ గల అధికారి అని మంత్రి కారుమూరి అన్నారు. అసలు అంజూ యాదవ్ గురించి పవన్ కల్యాణ్ కు తెలుసా అని అడిగారు. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ఘటనలో చంద్రబాబుని ప్రాణాలతో కాపాడింది అంజూ యాదవ్ అని మంత్రి కారుమూరి చెప్పారు. ఈ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకోవాలన్నారు.

Also Read..Pawan Kalyan: సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేశాను.. అయితే..: పవన్ కల్యాణ్

”జనసేన కార్యకర్తలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ తెచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సీఐ అంజూ యాదవ్ చర్యలు తీసుకున్నారు. అందులో తప్పేముంది? గతంలో స్థానిక ఎమ్మెల్యే కూతురు విషయంలోనూ ఇలానే ప్రవర్తించారు. పోలీసులు తమ డ్యూటీ చేయడం తప్పా? జనసేన కార్యకర్తలు తప్పు చేస్తే చర్యలు తీసుకోకూడదా? బీసీలను టార్గెట్ చేసినట్టుగా పవన్ వైఖరి ఉంది. మహిళా సీఐపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ నీ పద్ధతి మార్చుకో” అని మంత్రి కారుమూరి హితవు పలికారు.

జనసేన కార్యకర్తపై శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెయ్యి చేసుకోవడాన్ని పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా తిరుపతి వెళ్లి సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా తిరుపతి ఎస్పీ కార్యాలయం చేరుకున్న పవన్.. సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్న కొట్టె సాయితో పాటు మరో ఆరుగురితో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలుసుకుని ఫిర్యాదు అందజేశారు.

శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. నిరసనకారులను అదుపు చేసే క్రమంలో జనసేన లీడర్ కొట్టె సాయిపై సీఐ అంజూ యాదవ్ చెయ్యి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. తాను జన సైనికులకు అండగా ఉంటానని చెప్పారు. ఇందులో భాగంగా సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేశారాయన.