వీటిపై జాగ్రత్తగా మాట్లాడాలి.. పరిమితికి మించి ఎవ్వరూ మాట్లాడొద్దు: పవన్

కూటమి స్వరం బయట గట్టిగా వినిపించాలని చెప్పారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడారు? అన్న అంశంపై చర్చ జరిగింది.

వీటిపై జాగ్రత్తగా మాట్లాడాలి.. పరిమితికి మించి ఎవ్వరూ మాట్లాడొద్దు: పవన్

Pawan Kalyan

Updated On : October 4, 2025 / 9:59 PM IST

Pawan Kalyan: జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా సమస్యలపై చర్చలు జరిపారు. కూటమిలో వచ్చే సమస్యలపై జాగ్రత్తగా మాట్లాడాలని నేతలకు సూచించారు.

పరిమితికి మించి ఎవ్వరూ మాట్లాడవద్దని పవన్ ఆదేశించారు. కూటమి స్వరం బయట గట్టిగా వినిపించాలని చెప్పారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడారు? అన్న అంశంపై చర్చ జరిగింది. ఆయా విషయాలను పవన్ అడిగి తెలుసుకున్నారు.

Also Read: ఎమ్మెల్యేల తీరు అస్సలు బాలేదన్న సీఎం చంద్రబాబు.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో..

గ్యాప్ ఎక్కడ వచ్చిందో తెలుసుకోవాలని పవన్ చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్ట్స్ తన వద్ద ఉన్నాయని తెలిపారు. కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ రావడానికి కారణాలపై ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో పనిచేసిన విధంగా కార్యకర్తలు ఇప్పుడు ఎందుకు పని చేయడం లేదని నేతలను పవన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు నియోజవర్గ సమస్యలు కాకుండా వ్యక్తిగత అజెండాలకు వెళ్లవద్దని చెప్పారు. అంతర్గతంగా జరిగిన సమావేశం వివరాలను బయటకు చెప్పవద్దని నేతలకు ఆదేశాలు ఇచ్చారు.