ఎమ్మెల్యేల తీరు అస్సలు బాలేదన్న సీఎం చంద్రబాబు.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో..
కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు కావొస్తోంది. కానీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల నుంచే పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిందని సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందాయట.

Chandrababu Naidu: మీరు మళ్లీ గెలవాలి. మనం మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి. గెలిచాం..హ్యాపీగా సేద తీరుతాం అంటే కుదరదు. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా ఉండిపోతామంటే మీ ఇష్టం. తీరు మారాల్సిందే. నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే. పద్దతి మార్చుకోవాల్సింది. లేకపోతే మీ ఇష్టం. ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా చూసుకుంటానంటూ పలుసార్లు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.
అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే పలుసార్లు ఎమ్మెల్యేలతో మీటింగ్..లాస్ట్‌కు కొందరు ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీ అయ్యి కూడా పద్దతి మార్చుకోవాలని సూచించారు. అయినా కొందరు శాసనసభ్యుల తీరు మారడం లేదట. ఒక ఎమ్మెల్యే కాస్త సైలెంట్ అయ్యారు చెప్పినట్లు నడుచుకుంటున్నారనేలోపే మరో ఎమ్మెల్యే ఏదో ఒక ఇష్యూ రచ్చకెక్కుతున్నారట. కొందరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇరకాటంలో పడితే..మరికొందరు తామే రాజు తామే మంత్రి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు అయితే నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి..ఫారిన్ టూర్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారట. (Chandrababu Naidu)
మరికొందరు వారంలో ఒకటి రెండ్రోజులో నియోజకవర్గంలో ఉండి..సమస్యల పరిష్కారం మీద సీరియస్‌గా ఫోకస్ చేయడం లేదట. దీంతో సీఎం చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. వారి వ్యవహార శైలిపై మంత్రివర్గ భేటీలో అసహనం వ్యక్తం చేశారట. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యతలను ఇంఛార్జ్ మంత్రులు తీసుకోవాలని సూచించారట. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే ఇక తాను చర్యలు తీసుకోక తప్పదని తేల్చి చెప్పారట. కొందరు ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించినా.. కారణం ఏదైనా వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులేదనని స్పష్టం చేశారట చంద్రబాబు.
Also Read: రేవంత్, పీకే మధ్య ఎక్కడ చెడింది? ప్రశాంత్ కిశోర్ అంత పెద్ద శపథం ఎందుకు చేస్తున్నట్లు?
అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సెషన్ నడుస్తుండగానే పార్టీ ముఖ్యనేతల ముందు పలువురి ప్రస్తావన తెస్తూ సీరియస్ అయ్యారు. ఇప్పుడుగా మంత్రివర్గ భేటీలో అధికారిక ఎజెండా తర్వాత మరోసారి ఎమ్మెల్యేల తీరుపై చర్చకు తెచ్చారట చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపలా బయటా కట్టడి చేయాల్సిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని చంద్రబాబు స్పష్టం చేశారట.
ఎమ్మెల్యేలను నియంత్రించాలని సూచన
ఇంఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలని సూచించారట. ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పొప్పులను వారికి తెలియజేసి సరిచేసుకోవాలని సూచించాలని చెప్పారట. అయినా, వారు వినకుంటే తన దృష్టిలో పెట్టాలని నిర్దేశించారు. ఇంచార్జ్ మంత్రులే ఈ బాధ్యతను తీసుకోవాలని..కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానో, మరే కారణంతోనో పార్టీ లైన్‌ను దాటుతున్నారని.. ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని ఆదేశించారట.
కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు కావొస్తోంది. కానీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల నుంచే పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిందని సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందాయట. వెంటనే అలర్ట్ అయిన చంద్రబాబు వెంటవెంటనే ఎమ్మెల్యేలకు సలహాలు, సూచనలు ఇస్తూ సెట్‌రైట్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
ఇప్పుడు ఇంచార్జ్ మంత్రులకు..ఎమ్మెల్యేల నోరుకు కళ్లెం వేయాలని బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇన్నిసార్లు చెప్పినా మారని ఎమ్మెల్యేలు..అమాత్యులు చెప్తే మారుతారా..టంగ్ స్లిప్ కాకుండా..ఏది పడితే అది మాట్లాకుండా ఉండగలరా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అధినేత..పైగా సీఎం.. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కూడా కష్టమంటూ వార్నింగ్ ఇచ్చినా మారని ఎమ్మెల్యేలు..ఇప్పుడు మంత్రుల మాటను ఎంత వరకు లెక్కలోకి తీసుకుంటారనేది వేచి చూడాలి.