Kottu Satyanarayana : తాళి ఒకరికి కట్టి, సంసారం మరొకరితో చేస్తున్నాడు.. రాష్ట్ర ప్రజలకు అప్పుడే మనశ్శాంతి- పవన్ కల్యాణ్‌పై మంత్రి కొట్టు ఫైర్
తెలుగుదేశం పార్టీని సమాధి చేస్తే కానీ రాష్ట్ర ప్రజలకు శాంతి ఉండదు. Kottu Satyanarayana - Pawan Kalyan

Kottu Satyanarayana - Pawan Kalyan (Photo : Google)
Kottu Satyanarayana – Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ ఒకరికి తాళి కట్టి, మరొకరితో సంసారం చేస్తున్నారు అని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఆయన విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ బీజేపీ కితాళి కట్టి, తెలుగుదేశంతో సంసారం చేస్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు.
” చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు. ధర్మం వైపు ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు కటాక్షం ఉంది. దుర్మార్గుడైన చంద్రబాబు అధర్మం వైపు ఉన్నారు. మాలోకం లోకేశ్ బాబు ఎవరెవరిని లోపల పెట్టాలో 100 పుస్తకాలు రాశాడంట.
తెలుగుదేశం పార్టీలో పని చేసే వారు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి టికెట్ ఇస్తాడంట. అసలు మతి ఉందా? 2024లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని సమాధి చేస్తే కానీ రాష్ట్ర ప్రజలకు శాంతి ఉండదు. చంద్రబాబు కాపు ఓట్లు కావాలని అంటూనే పవన్ కల్యాణ్ తో కాపులను తిట్టిస్తారు. పవన్ ని ప్రజల్లో చులకన చేయాలని, జీరో చేసేయాలని చంద్రబాబు కుట్ర.
చంద్రబాబు ఏం రాసిస్తే అది ప్రజల్లోకి వచ్చి మాట్లాడి పవన్ చులకన అయిపోయారు. చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారు. జగన్ ఉంటే వీళ్ళ దోపిడీ జరగదని, అధికారంలో ఉంచకూడదని దుష్టచతుష్టయం పన్నగాలు పన్నుతున్నారు.