పరిపాలనలో మాకు మొదట్లో ఎదురైన ముఖ్యమైన ఛాలెంజ్‌ ఇదే: మంత్రి నాదెండ్ల

"టెక్నాలజీని వాడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని తెలిపారు.

పరిపాలనలో మాకు మొదట్లో ఎదురైన ముఖ్యమైన ఛాలెంజ్‌ ఇదే: మంత్రి నాదెండ్ల

Updated On : June 15, 2025 / 10:15 PM IST

ఏపీలో ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 10టీవీ నిర్వహించిన మెగా ఈవెంట్ “షైనింగ్ ఏపీ”లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఏపీ ప్రజలు ఓ అద్భుతమైన తీర్పు ఇచ్చారు. కూటమిపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. సమర్థవంతమైన పరిపాలనను కోరుకున్నారు. ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కావాలని కోరుకున్నారు.

రాష్ట్రంలోని వ్యవస్థలను గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు, స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేసింది. మాకు మొదట్లో అన్నింటికన్నా ముఖ్యమైన ఛాలెంజ్‌ ఈ వ్యవస్థను ఎలా మార్చాలి? మళ్లీ ఎలా పనిచేయించాలి?

రెండోది ఆర్థిక ఇబ్బందులు. ఎక్కడి నుంచి, ఎంత వడ్డీకి లోన్లు తీసుకొచ్చారో క్రోడీకరించాం. పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తు.చ తప్పకుండా చేస్తున్నాం. గుంతలు లేని రహదారులను తీసుకొచ్చాం. గతంలో రహదారులు ఎలా ఉండేవో ప్రజలే చూశారు.

కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేశాం. ఉద్యోగులను వైసీపీ హయాంలో జీతాలు ఎప్పుడు పడేవే వారికే తెలియదు. ఇప్పుడు ఒకటో తారీఖే వేస్తున్నాం. రైతులకు ఇచ్చే డబ్బులు వారి ఖాతాల్లోనే వేస్తున్నాం. టెక్నాలజీని వాడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు.