PM Modi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రధాని హోదాలో తిరుమలకు రావడం ఎన్నోసారో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలను దర్శించుకోవటం నాల్గోసారి. గతంలో..

PM Modi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రధాని హోదాలో తిరుమలకు రావడం ఎన్నోసారో తెలుసా?

PM ModI

PM Modi Tirumala Tour : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ప్రధాని ఆలయంలో కొద్దిసేపు గడిపారు. ఆ తరువాత మోదీకి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అందజేశారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందే మోదీ శ్రీవారిని దర్శించుకొని అతిథిగృహం చేరుకున్నారు.

Also Read : Telangana Elections 2023 : బీజేపీ జోరు.. రంగంలోకి అగ్రనేతలు, ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తిరుమలను దర్శించుకోవటం ఇది నాల్గోసారి. 2015, 2017, 2019 సంవత్సరాల్లో ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భంగా తిరుమల వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. వీఐపీ అతిథి గృహాలను ఎన్ఎస్జీ టీమ్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇదిలాఉంటే.. ప్రధాని తిరుమల దర్శనం పూర్తికావడంతో తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి తెలంగాణకు బయలుదేరారు. ఇవాళ మహబూబాబాద్, కరీంనగర్ లలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షోలో మోదీ పాల్గొంటారు.