Andhra Pradesh : 65,000 కిలోల గంజాయిని దగ్థం చేసిన పోలీసులు .. మంటల్లో కాలిబూడిదైన రూ.13 కోట్ల గంజాయి
ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు 65,000కిలోల గంజాయిని దగ్థం చేశారు. ఆరు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న 65,000కిలోల గంజాయిని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గజపతినగరంలో కాల్చివేశారు. ఈ గంజాయి విలువ రూ.13 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Police burnt 65,000 kg of cannabis worth Rs 13 crore
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు 65,000కిలోల గంజాయిని దగ్థం చేశారు. ఏపీలోని ఏలూరు రేంజ్ పరిధిలో మత్తు పదార్దాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఆరు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న 65,000కిలోల గంజాయిని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గజపతినగరంలో కాల్చివేశారు. ఈ గంజాయి విలువ రూ.13 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఆరు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న 65,000కిలోల గంజాయిని తొమ్మిది బట్టీలపై పెట్టి నిప్పు పెట్టారు పోలీసు ఉన్నతాధికారులు. ఆపరేషన్ పరివర్తన్ తో గంజాయి సాగు తగ్గిందని డీఐజీ పాలరాజు తెలిపారు. 2020 నుంచి గంజాయి సాగు 43శాతం తగ్గిందని తెలిపారు.ఇదే స్ట్రాటజీతో ఈ కార్యక్రమం కొనసాగిస్తే కేవలం ఐదేళ్లలోనే గంజాయి సాగు..తరలింపులు పూర్తిగా తగ్గిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గంజాయి సాగుచేసే ప్రాంతాల్లో ఇప్పుడు పండ్ల సాగు చేస్తున్నారని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆపిల్, డ్రాగన్, లిచి పంటలు పడిస్తున్నారని ఈ పంటలకు ప్రభుత్వం మార్కెటింగ్ సమదుపాయాలు కల్పించదని డీఐజీ పాలరాజు తెలిపారు. రూ.13 కోట్లు విలువైన 65,000కిలోల గంజాయిని దగ్ధం చేయటానికి కేవలం రూ.17ఖర్చు అయ్యిందని తెలిపారు.