JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డితోపాటు 13 మంది ఆయన అనుచరులపై కేసు నమోదు.. తాడిపత్రిలో జేసీ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, హై టెన్షన్
ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు.

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy Case Registered : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డితోపాటు మరో 13 మంది జేసీ అనుచరులపై తాడిపత్రి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 308/2023 U/s 147, 148, 341, 506, 427 R/W 148 ipc మరియు sec 3 of PDPP ACT సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్ కి చెందిన 53 పిల్లర్లను డామేజ్ చేసి, గుంతలు పూడ్చేశారంటూ వైసీపీ నాయకుడు గురు శంకర్ ఫిర్యాదు చేశారు.
గురు శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు 13 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు. జేసీ నివాసం చుట్టూ భారీ కేడ్లను అడ్డం పెట్టి ఆయన అనుచరులను రానీయకుండా పొలీసులు అడ్డుకుంటున్నారు.
ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్ఐలు, భారీగా స్పెషల్ పార్టీ పోలీస్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న నేపథ్యంలో తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. తాడిపత్రి పట్టణంలో 30 యాక్టు అమలులో ఉంది. ఎవ్వరూ గుంపులు గుంపులుగా ఉండకూడదు. అలాగే నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదని పోలీసులు అంటున్నారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.