Gang Selling Baby : పసిబిడ్డలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు..దత్తత పేరుతో శిశువు రూ.2 లక్షల 70వేలకు విక్రయం

తెలుగు రాష్ట్రాల్లో పసి బిడ్డలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఏలూరు జిల్లా పోలీసులు ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఏలూరులోని అమ్మపాలెంకు చెందిన ఓ శిశువును రూ.2 లక్షల 70వేలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

Gang Selling Baby : పసిబిడ్డలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు..దత్తత పేరుతో శిశువు రూ.2 లక్షల 70వేలకు విక్రయం

Arrest

Updated On : August 1, 2022 / 6:49 PM IST

gang selling baby : తెలుగు రాష్ట్రాల్లో పసి బిడ్డలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఏలూరు జిల్లా పోలీసులు ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఏలూరులోని అమ్మపాలెంకు చెందిన ఓ శిశువును రూ.2 లక్షల 70వేలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ముఠాలో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ రాహుల్ దేవ్‌ శర్మ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ఏలూరు పోలీసులు గుర్తించారు. ఆశా వర్కర్‌ నాగమణి…పిల్లలు లేని ఓ కుటుంబాన్ని సంప్రదించి విక్రయానికి ప్రయత్నించారు. తమ దగ్గర ఉన్న బేబీని దత్తతకు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. దీంతో ఇరువురి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం శిశువును తీసుకునేందుకు రెడీ అయ్యారు.

Couple Sells Infant: మగ శిశువును డాక్టర్‌కు అమ్మేసిన భార్యాభర్తలు

అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులపై గతంలో మంగళగిరిలో కూడా కేసు నమోదై ఉందని పోలీసులు తెలిపారు. ఇక హైదరాబాద్‌లో కూడా శిశువు విక్రయాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది.