మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు, ఆంధ్రలో 4.. తెలంగాణ 2
ఏప్రిల్‌లో ఖాళీ అవనున్న 55రాజ్య సభ సీట్ల కోసం మార్చి 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. 17రాష్ట్రాల్లోని పలు స్థానాల్లో ఉన్న ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ నెలలో తేదీలను బట్టి ముగియనుంది. ’17రాష్ట్రాల్లో ఉన్న 55 రాజ్యసభ స్థానాలు పదవీ కాలం ఏప్రిల్ నాటికి ముగియనుంది. వాటిని భర్తీ చేసేందుకు మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి’ అని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
ఎలక్షన్ షెడ్యూల్ వివరాల ప్రకారం.. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 13నాటికి నామినేషన్స్ ప్రక్రియ ముగియాల్సి ఉంది. మార్చి 26న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్లను లెక్కిస్తారు.
ఆ రిటైర్మెంట్ తేదీల వారీగా స్థానాల వివరాలిలా ఉన్నాయి:
| రాష్ట్రం | స్థానాలు | పదవీకాలం ముగియనున్న తేదీ |
|---|---|---|
| మహారాష్ట్ర | 7 | 2020 ఏప్రిల్ 02 |
| ఒడిశా | 4 | |
| తమిళనాడు | 6 | |
| పశ్చిమ బెంగాల్ | 5 | |
| ఆంధ్రప్రదేశ్ | 4 | 2020 ఏప్రిల్ 09 |
| తెలంగాణ | 2 | |
| అస్సాం | 3 | |
| బీహార్ | 5 | |
| చత్తీస్ ఘడ్ | 2 | |
| గుజరాత్ | 4 | |
| హర్యానా | 2 | |
| హిమాచల్ ప్రదేశ్ | 1 | |
| జార్ఖండ్ | 2 | |
| మధ్యప్రదేశ్ | 3 | |
| మణిపూర్ | 1 | |
| రాజస్థాన్ | 3 | 2020 ఏప్రిల్ 12 |
