Robin Sharma: ఇప్పటికే టీడీపీ తరఫున రాబిన్ శర్మ.. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్.. ఏం చేస్తున్నారో తెలుసా?
ఇప్పటికే టీడీపీలో అనేక మార్పుల వెనుక వారు ఉన్నారు. వారందరితో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు నాయుడు తనకు చివరి ఛాన్స్ ఇవ్వాలని...

TDP
Robin Sharma: షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు రాబిన్ శర్మ. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీలో రాబిన్ శర్మ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే రాబిన్ శర్మ టీడీపీకి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు.
గత ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేశ్ ప్రభావం అంతంత మాత్రమే. ఈ సారి మాత్రం ఆయనలో అందరూ డైనమిక్ లీడర్‌ను చూస్తున్నారు. టీడీపీలోని కీలక నేతలకు తోడుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారితో జతకట్టారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మ ప్రణాళికలు రూపొందిస్తారు.
ఇప్పటికే టీడీపీలో అనేక మార్పుల వెనుక రాబిన్ శర్మ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తనకు చివరి ఛాన్స్ ఇవ్వాలని అన్న వ్యాఖ్యల వెనుక రాబిన్ శర్మ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే, తాను మళ్లీ గెలిస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తానని చెప్పడం, మీడియా ముందు చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం వెనుక రాబిన్ శర్మ ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
రాబిన్ శర్మను టీడీపీ తరఫున కొనసాగిస్తూనే ప్రశాంత్ కిశోర్ సలహాలను చంద్రబాబు నాయుడు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేటి చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ సమావేశంలో రాబిన్ శర్మ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. టీడీపీ కొనసాగించిన ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని రాబిన్ శర్మే రూపొందించారు. అంతేగాక, ‘బాదుడే బాదుడు’ వంటి అనేక కార్యక్రమాలను టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది.
మూడో వ్యూహకర్త శాంతను సింగ్?
రాబిన్ శర్మ రూపొందించిన ఆయా కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్తగా ప్రశాంత్ కిశోర్ సూచనలతో షో టైమ్ కన్సల్టెన్సీ సభ్యులు టీడీపీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మ గతంలో ఐ ప్యాక్ లో పనిచేశారు. రాబిన్ శర్మ ఇప్పుడు వేరుగా వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో వీరిద్దరికి తోడు మరో ఐ ప్యాక్ మాజీ కీలక నాయకుడు శాంతను సింగ్ కూడా టీడీపీ ఇటీవలే తమ వ్యూహకర్తల జాబితాలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది.
Prashant Kishor: ఎన్నికల వేళ విజయవాడకు ‘వ్యూహకర్త’ ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుతో భేటీ