AP New Cabinet : కొత్త మంత్రివర్గం లిస్టు సిద్ధం.. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

ప్రస్తుతం 56 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు, ఇప్పటిదాకా ఉన్న కేబినెట్‌లోని 10 మంది కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

AP New Cabinet : కొత్త మంత్రివర్గం లిస్టు సిద్ధం.. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Ap Cabinet

Updated On : April 10, 2022 / 7:11 AM IST

AP New Cabinet : కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం సమీపిస్తుండటంతో.. ఏపీ మంత్రుల రాజీనామా లేఖలు రాజ్‌భవన్‌కు చేరాయి. ఉదయం 11 గంటల తర్వాత మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించే అవకాశముంది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గెజిట్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం వరకు కేబినెట్ కూర్పుపై జగన్ కసరత్తు చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత.. లిస్ఠ్ ఫైనల్ చేసి కొత్త మంత్రులకు సమాచారమిస్తారు.

Read More : AP Cabinet : కొత్త మంత్రుల్లో ఎవరెవరు ఉండనున్నారు? పాత మంత్రుల్లో ఎవరిని కొనసాగిస్తారు?

ప్రస్తుతం 56 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు, ఇప్పటిదాకా ఉన్న కేబినెట్‌లోని 10 మంది కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మంత్రుల రాజీనామాలను సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ కు పంపారు. 25 మందితో రాజ్‌భవన్‌కు ఆదివారం కొత్త జాబితా పంపనున్నారని తెలుస్తోంది. కేబినెట్‌ బెర్తు దక్కించుకున్న వారికి సీఎంవో నుంచి ఆదివారం ఫోన్ కాల్స్ వెళ్లనున్నాయి. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణం చేయనున్నారు. తాత్కాలిక సచివాలయంలో బ్లాక్‌–1 పక్కన వేదిక సిద్ధం చేశారు.

Read More : AP Cabinet : నేడు రాజ్‌భవన్‌కు పాత మంత్రుల రాజీనామాలు.. రేపు గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితా

కరకట్ట రోడ్డుపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు మాత్రమే అనుమతినివ్వనున్నారు.ప్రజలు, అభిమానులకు మంగళగిరి, ఎర్రబాలెం మీదుగా ఓ మార్గం, ఉండవల్లి సెంటర్, కృష్ణాయపాలెం మీదుగా మరో మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత పాత, కొత్త మంత్రులతో కలిసి సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తేనీటి విందులో పాల్గొననున్నారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ చేశారు.

Read More : Kodali Nani: సీఎం జగన్ దగ్గర ఉండేవి రెండే టీములు – కొడాలి నాని

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వివిధ శాఖలకు విధులను అప్పగిస్తూ జీఏడీ (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా సాధారణ పరిపాలన (ప్రోటోకాల్‌) విభాగం ఇప్పటికే సిద్ధం చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కొత్త, పాత మంత్రులు, అతిధులకు మధ్యాహ్నాం 1 గంటకు సచివాలయంలో తేనేటీ విందు (హైటీ) ఏర్పాటు చేశారు.