మొదటి రాత్రే భార్యకు నరకం చూపించిన సైకో భర్త

psycho husband beats wife on first night : కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆయువతికి భర్త ప్రవర్తన వింతగా తోచింది. పెళ్లైన మొదటి రాత్రి కాళరాత్రిగా మారింది. జీవితాంతం తీయని జ్ఞాపకం గా ఉండాల్సిన రాత్రి మాయని మచ్చగా మిగిలింది. భర్తతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న యువతి కలలు కల్లలయ్యాయి. ఉన్నత చదువులు చదివి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న గుంటూరు యువతికి, హైదరాబాద్ లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ప్రకాశం జిల్లా కు చెందిన యువకుడితో అక్టోబర్ లో వివాహం అయ్యింది.
పెళ్ళి తర్వాత కొత్త కాపురం గురించి ఎన్నెన్నో కలలు కంది. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉన్న మొదటి రాత్రి ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. భర్త వింత ప్రవర్తనతో షాక్ తిన్నది. భయపడుతున్నాడేమో అనుకుని మరి కొంతకాలం వేచి చూద్దామని అనుకుంది. భర్తతో సన్నిహితంగా ఉండసాగింది. అయినా అతడిలో మార్పు రాలేదు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మరో సారి మొదటి రాత్రికి సిధ్దం చేశారు పెద్దలు. రెండు నెలలైనా అతడిలో మార్పు రాకపోగా ఆరాత్రి సైకో గా మారి భార్యకు నరకం చూపించాడు. ఆమె నైటీ వేసుకుని వింతగా ప్రవర్తించాడు. భార్యకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. శరీరంలో చెప్పుకోలేని చోట్ల బ్లేడుతో గాయాలు చేశాడు. రాక్షసంగా ప్రవర్తించాడు. భర్త ప్రవర్తనతో భయపడిపోయిన యువతి తల్లితండ్రులకు విషయం చెప్పి భోరున విలపించింది.
దీంతో వధువు తరుఫు వారు అబ్బాయి తల్లి తండ్రుల దగ్గరకెళ్లి ఇదేంటని నిలదీశారు. మీ అమ్మాయే సంసారానికి పనికిరాదంటూ అబ్బాయి తల్లి తండ్రులు ఆరోపిస్తూ గొడవకు దిగారు. ఈ క్రమంలో వధువు తల్లితండ్రులు న్యాయం చేయాలంటూ గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయంలోని స్పందనలో ఫిర్యాదు చేశారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న స్పందన పోలీసులు కేసును నరసరావు పేట పోలీసు స్టేషన్ కు బదిలీ చేసి విచారణ చేపట్టమని ఆదేశించారు.