పొదిలిలో కొండచిలువ కలకలం, ఆందోళనలో స్థానికులు

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 02:30 PM IST
పొదిలిలో కొండచిలువ కలకలం, ఆందోళనలో స్థానికులు

Updated On : November 9, 2020 / 2:40 PM IST

podili python: ప్రకాశం జిల్లా పొదిలిలో కొండచిలువ కలకలం సృష్టించింది. దర్శి రోడ్‌లో కొండచిలువ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టుకోడానికి ప్రయత్నించడంతో పొదల్లోకి వెళ్లి కనపడకుండా పోయింది. మళ్లీ జనావాసాల్లోకి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. పొదిలిలో గతంలో కూడా పలుమార్లు కొండచిలువలు జనావాసాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పట్టుకుని అడవుల్లో వదిలేశారు. ఇప్పుడు కూడా అలానే చేయాలని స్థానికులు కోరుతున్నారు.