Thirumala : నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల

సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. రూ.300 టికెట్ల కోటాను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది

Thirumala : నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల

Tirumala (1)

Updated On : August 24, 2021 / 8:19 AM IST

Thirumala Srivari : సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇవాళ విడుదల చేయనుంది. వచ్చే నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్ల కోటాను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో, గోవిందా యాప్‌ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

వాస్తవానికి ఈ నెల 20న ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల కావాల్సిన ఉండగా..టీటీడీ టికెట్ల విడుదల వాయిదా వేసింది. ఇవాళ టీటీడీ ఆన్‌లైన్‌ 8వేల టికెట్లను అందుబాటులో ఉంచనుంది. భక్తులు కరోనా నిబంధనలు పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని కోరింది. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఇస్తున్న తరహాలోనే రోజుకు 8 వేల టికెట్లను కేటాయించనున్నారు.

మాజీ సీఎస్‌ ఎల్ వీ సుబ్రహ్మణ్యం శ్రీవారిని నిన్న దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో ఆలయంలోకి వెళ్లారు. అధికారులు ఆయనకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.