AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఐదు బిల్లులు ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం.. అవేమిటంటే?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఐదు బిల్లులను సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఐదు బిల్లులు ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం.. అవేమిటంటే?

Raghu Rama Krishna Raju

Updated On : November 14, 2024 / 9:00 AM IST

AP Assembly Budget Session 2024: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఐదు బిల్లులను సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఐదు బిల్లులు ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణంరాజు ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయే కూటమి తరపున వేసిన నామినేషన్ ను కూటమిలోని మూడు పార్టీలు నేతల ఆమోదించారు. దీంతో రఘురామ కృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించనున్నారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read: మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మేము అరెస్ట్ చేస్తున్నాం- జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్

అదేవిధంగా ఇవాళ్టి అసెంబ్లీ సమావేశంలో 2024-25 బడ్జెట్ పై చర్చ జరగనుంది. ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ 4.0పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేయనున్నారు. ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీల పై మంత్రి టీజీ భరత్ ప్రకటన చేయనున్నారు.

Also Read: సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?

ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లులు..
రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ఐదు బిల్లులు ప్రవేశపెట్టనుంది.
ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ చట్ట సవరణ బిల్లు -2024 ను వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ ఆయుర్వేదిక్, హోమియో ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు -2024ను సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ చట్ట సవరణ బిల్లు -2024ను కూడా మంత్రి సత్యకుమార్ సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు-2024 ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ విద్యుత్ సుంకం చట్ట సవరణ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో ప్రవేశపెట్టనున్నారు.