Rain Alert : మళ్లీ వానలు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక హెచ్చరికలు జారీ

Rain Alert : అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Rain Alert : మళ్లీ వానలు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక హెచ్చరికలు జారీ

Rain Alert

Updated On : November 16, 2025 / 7:14 AM IST

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజుల క్రితం వరకు వర్షాలు దంచికొట్టాయి. ప్రస్తుతం చలి వణికిస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. ఆ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు (Rain Alert) కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 14వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి దిశగా కదులుతూ.. నవంబర్ 15వ తేదీన శ్రీలంక తీరాన్ని తాకింది. అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read : Sankranti School Holidays: స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటి నుంచి అంటే..

అల్పపీడనం కారణంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది వచ్చే 24గంటల్లో పశ్చిమ -వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని పేర్కొన్నారు. ఈ కారణంగా సోమ, మంగళవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఏపీలో సోమవారం రోజు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిస చాన్స్ ఉంది. ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉంది. అదేవిధంగా మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇదిలాఉంటే.. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఈనెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.