AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో వర్షాలు

ఏపీలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో

AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో వర్షాలు

Ap Rain Alert

Updated On : June 23, 2021 / 7:08 AM IST

Rain Alert : ఏపీలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో వానలు కురుస్తాయంది. ఉత్తరకోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరకోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండో చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.

రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వారం, పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. కొన్ని రోజులుగా ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉక్కపోతతో జనాలు విలవిలలాడుతున్నారు. అటు అన్నదాతలు కూడా వర్షాల కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.