Kadapa : చిరుజల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలు..సీఎం షెడ్యూల్‌లో మార్పులు ?

చిరుజల్లులు కురవడంతో పాటు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Kadapa : చిరుజల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలు..సీఎం షెడ్యూల్‌లో మార్పులు ?

Jagan

Updated On : September 2, 2021 / 8:03 AM IST

Rain in Kadapa : కడప జిల్లాలో వర్షం కురుస్తోంది. 2021, సెప్టెంబర్ 02వ తేదీ ఉదయం నుంచి చిరుజల్లులు కురవడంతో పాటు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో సీఎం జగన్ షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. హెలికాప్టర్ కు వాతావరణం అనుకూలించకపోతే…ఎలా అనే సందిగ్ధంలో ఉన్నారు అధికారులు. సీఎ జగన్ ఇడుపులపాయకు వెళ్లి..వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారనే సంగతి తెలిసేందే. ఉదయం 11.30 గంటల మధ్య వర్షం ఎక్కువైతే…సీఎం షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

Read More : TRS office in Delhi: కేసీఆర్‍‌కు నామా డిన్నర్.. సతీసమేతంగా ఢిల్లీకి సీఎం

ఉదయం 9 గంటల 35 నిమిషాలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ నివాళులర్పిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వత పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Read More : Afghanistan : తాలిబన్లను నమ్మొచ్చా ? ఉగ్రవాదుల నోట కశ్మీర్ రాగం

బుధవారం కడప జిల్లా ఇడుపులపాయకు వచ్చిన జగన్‌ను వైసీపీ నేతలు, ప్రజలు కలిశారు. సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. రాత్రి ఇక్కడి గెస్ట్ హౌస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ బస చేశారు.