Raja: కాంగ్రెస్ పార్టీలో చేరిన టాలీవుడ్ యంగ్ హీరో

ఏపీలోని హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలు జరుతున్నాయని చెప్పారు. జగన్ సర్కారు విద్యను..

Raja: కాంగ్రెస్ పార్టీలో చేరిన టాలీవుడ్ యంగ్ హీరో

Raja

Raja – APCC: ఆనంద్, వెన్నెల, స్టైల్, ఆ నలుగురు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యువనటుడు రాజా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో ఏపీసీసీ (APCC) అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో రాజా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ… చిన్న వయసులోనే రాజా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. తమ పార్టీ విధానాలు నచ్చి తమతో కలవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సర్కారుపై గిడుగు రుద్రరాజు విమర్శలు గుప్పించారు.

ఏపీలోని హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలు జరుతున్నాయని చెప్పారు. జగన్ సర్కారు విద్యను వ్యాపారంగా మార్చిందని విమర్శించారు. వర్సిటీలో అడ్మిషన్ల విషయంలో జరుగుతున్న అక్రమాలపై వీసీ, రిజిస్ట్రార్ స్పందించక పోవడం ఏంటని నిలదీశారు. 2వ విడత కౌన్సెలింగ్ లోనైనా చేసిన తప్పును సరిచేసుకోవాలని అన్నారు.

లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. మహిళా బిల్లు అంశం కాంగ్రెస్ హయాంలోనే ముందుకు వెళ్లిందని, అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు కలసిరాకపోటంతో నిలిచిపోయిందని అన్నారు. మహిళలకు ఓటు హక్కు కూడా కల్పించింది కాంగ్రెస్ హయాంలోనేనని అన్నారు.

AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు, దసరా నుంచి విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన