Superstar Rajinikanth: ఒకే వేదికపైకి చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ..!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28న విజయవాడలో జరిగే సభలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ పాల్గోనున్నారు.

Superstar Rajinikanth: ఒకే వేదికపైకి చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ..!

Superstar Rajinikanth

Updated On : April 22, 2023 / 9:26 AM IST

Superstar Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈనెల 28న విజయవాడ రానున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు శత జయంతి ఉత్సవాలు విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో 28న సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథులుగా రజనీకాంత్‌తో పాటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొంటారు. వీరుముగ్గురు ఒకే వేదికను పంచుకోనున్నారు.

Chandrababu : యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. పోటీ చేసే దమ్ముందా? అంటూ మంత్రికి సవాల్

ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సభలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలతో కూడిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పలు రంగాల ప్రముఖులుసైతం పాల్గోనున్నారు.