Chandrababu : యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. పోటీ చేసే దమ్ముందా? అంటూ మంత్రికి సవాల్

Chandrababu : అధికారంలోకి రాగానే భూకబ్జాలకు పాల్పడిన మంత్రి సురేశ్ పై విచారణ చేపడతామన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు

Chandrababu : యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. పోటీ చేసే దమ్ముందా? అంటూ మంత్రికి సవాల్

Chandrababu (Photo : Google)

Chandrababu : యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి ఎరిక్షన్ బాబు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చంద్రబాబు చెప్పారు. ఎరిక్షన్ బాబుపై పోటీ చేసే దమ్ము ఉందా? అని మంత్రి ఆదిమూలపు సురేశ్ కి సవాల్ విసిరారు చంద్రబాబు. యర్రగొండపాలెంలో మంత్రి సురేశ్ ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అధికారంలోకి రాగానే భూకబ్జాలకు పాల్పడిన మంత్రి సురేశ్ పై విచారణ చేపడతామన్నారు. యర్రగొండపాలెం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.

జగన్ పాలనలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని చంద్రబాబు వాపోయారు. జాబు రావాలంటే బాబు రావాలి అని నినదించారు. వైసీపీ చేతకానితనం వల్లే వెలిగొండ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందన్నారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు అందిస్తా అని హామీ ఇచ్చారు.

Also Read..Meruga Nagarjuna : దొంగ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడు : మంత్రి మేరుగ నాగార్జున

సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. మార్కాపురం కేంద్రంగా జిల్లాని ఎందుకు చేయలేదో సీఎం జగన్, మంత్రి సురేశ్ చెప్పాలని నిలదీశారు. రాష్ట్రoలో జగన్ రౌడీ రాజ్యాన్ని సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. భస్మాసురుడిని నమ్మి ప్రజలు నిలువునా మోసపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నాసిరకం మద్యం, గంజాయితో ప్రజల సొమ్మును జగన్ దోచుకుంటున్నాడు అని చంద్రబాబు మండిపడ్డారు. తన ముందు కుప్పి గంతులు వేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కోర్టులను మోసం చేసే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వం దళితులపై దాడులు చేసినప్పుడు మంత్రి సురేశ్ ఎక్కడ ఉన్నారని చంద్రబాబు అడిగారు. దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.