Ram Charan Fans : దుర్గగుడిలో అపచారం.. హుండీలపై నిల్చొన్న రామ్ చరణ్ ఫ్యాన్స్
రామ్ చరణ్, కొరటాల శివ వెంటే ఆలయంలోకి చొచ్చుకొని రావడంతో.. ఆలయ గ్రిల్స్ విరిగిపోయాయి...రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం జై చరణ్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది.

Aacharya
Ram Charan Fans Indrakeeladri Temple : మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. ప్రముఖ ఆలయంలో ఒకటైన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలోకి చరణ్ ఫ్యాన్స్ చొచ్చుకుని వచ్చారు. ఎన్నడూ లేని విధంగా దుర్గమ్మ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేయడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. అభిమానులు చేసిన పనికి రామ్ చరణ్ నిరుత్సాహానికి గురయినట్లు తెలుస్తోంది. పూర్తిగా దుర్గగుడి అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాంటూ భక్తులు వెల్లడిస్తున్నారు. దుర్గగుడిని అపవిత్రం చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
Read More : Acharya: యూఎస్ లో దుమ్మురేపుతున్న ఆచార్య ప్రీ బుకింగ్స్
ప్రముఖ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించారు. సినిమా విడుదలవుతున్న క్రమంలో.. కొరటాల శివ, రామ్ చరణ్ లు విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సమాచారం అధికారులకు తెలియచేశారు. 2022, ఏప్రిల్ 27వ తేదీ బుధవారం ఉదయం వీరిద్దరూ రావాల్సి ఉంది కానీ.. రెండు గంటల పాటు లేట్ గా వచ్చారు. ముందుగానే ఈ విషయం అభిమానులకు తెలిసిపోవడంతో వారు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. రామ్ చరణ్ రాగానే.. ఆయన్ను చూడడానికి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Read More : Acharya: ఆచార్యకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ముందుకు తోసుకరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. రామ్ చరణ్, కొరటాల శివ వెంటే ఆలయంలోకి చొచ్చుకొని రావడంతో.. ఆలయ గ్రిల్స్ విరిగిపోయాయి. వీరిని కంట్రలోల్ చేయడంలో అధికారులు, పోలీసులు చేతులెత్తేశారు. దుర్గగుడి అంతరాలయంలో జై దుర్గమ్మ, జైజై దుర్గమ్మ నినాదాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం జై చరణ్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. అంతేగాకుండా హుండీపై నిల్చొని నినాదాలు చేస్తూ.. వీడియోలు తీసుకోంటూ అత్యుత్సాహానికి పాల్పడ్డారు. అక్కడున్న భక్తులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. దుర్గమ్మ గుడిలో తీవ్రమైన అపచారం జరిగిందని పేర్కొంటున్నారు. అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేయడంలో విఫలమయ్యారని, వారిని కంట్రోల్ చేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు, దుర్గ అధికారుల సమన్వయం లోపం కారణంగా గందరగోళం ఏర్పడిందని, మొత్తంగా ఆలయంలో అపచారం చోటు చేసుకుందని అంటున్నారు. మరి ఈ ఘటనపై విజయవాడ దుర్గగుడి ఆలయ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.