Acharya: ఆచార్యకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

ఆచార్య.. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ...

Acharya: ఆచార్యకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Ticket Prices Hiked In Telangana For Acharya Movie

Acharya: ఆచార్య.. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. కానీ ఇంకా ఈ సినిమా టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో, ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఆతృతగా చూస్తున్నారు.

Acharya: ఆచార్యలో మరో బ్యూటీ.. ఎవరంటే?

అయితే ఇటీవల బడా సినిమాలన్నింటికీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్, కేజీయఫ్-2 లాంటి భారీ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కలిగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఆచార్య చిత్రానికి కూడా టీ-సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 29 నుండి మే 5 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆచార్య చిత్రానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.50, ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్.. టార్గెట్ ఎంతంటే?

అంతేగాక తెలంగాణలో ఆచార్య చిత్రానికి 5వ ఆట ప్రదర్శనకు కూడా సర్కార్ వెసులుబాటు కల్పించింది. వారం రోజుల పాటు ఈ వెసులుబాటు ఉండనుండటంతో ఆచార్య చిత్ర యూనిట్ తెలంగాణ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ అంశాలతో ఎమోషన్ జోడించి కొరటాల శివ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అటు ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ అంటోంది. మరి ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.