Ramana Deekshitulu: మరోసారి తెరపైకి పింక్‌ డైమండ్.. ఎలా పగిలింది?

పింక్‌ డైమండ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పింక్‌ డైమండ్‌పై టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మరోసారి హాట్‌కామెంట్స్ చేశారు.

Ramana Deekshitulu: మరోసారి తెరపైకి పింక్‌ డైమండ్.. ఎలా పగిలింది?

Ramanadeekshitulu Once Again Hot Comments On Pink Diamond

Updated On : April 6, 2021 / 4:43 PM IST

Ramanadeekshitulu hot comments : పింక్‌ డైమండ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పింక్‌ డైమండ్‌పై టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు హాట్ ‌కామెంట్స్ చేశారు. పింక్ డైమండ్ ఎలా పగులుతుందని నిలదీశారు.

డైమండ్ పగిలితే దాని ముక్కలైనా ఉండాలి కదా అని ప్రశ్నించారు. పింక్‌ డైమండ్‌కు సంబంధించి గత రికార్డులు పరిశీలించాలని రమణ దీక్షతులు కోరారు. నిపుణులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని రమణదీక్షితులు చెప్పుకొచ్చారు.

సీఎం జగన్‌పై రమణదీక్షితులు ప్రశంసలు గుప్పించారు. జగన్ ను విష్ణుమూర్తితో పోల్చారు. ధర్మానికి ఇబ్బందులు ఎదురవడంతో మహావిష్ణువులాగా వేంకటేశ్వరుడి అనుగ్రహంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని రమణదీక్షితులు పేర్కొన్నారు.