YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి.. ప్రత్యేక భద్రత నడుమ హైదరాబాద్ కు తరలింపు
గడిచిన వారం రోజులుగా ఆయన తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు.

Ranganna
YS Viveka Case Key Witness : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్న తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న రంగన్నను చికిత్స కోసం మొదట తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక భద్రత మధ్య అంబులెన్స్ లో రంగన్నను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, రెండు రోజుల క్రితమే రంగన్న అనారోగ్యంతో పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి వచ్చారు.
గడిచిన వారం రోజులుగా ఆయన తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు. అయితే స్విమ్స్ లో పర్మానాలజీ డిపార్ట్ మెంట్ కు సంబంధించి మరింత ఎక్స్ పర్ట్ లేరన్న కారణంగా దీనికి సంబంధించిన స్పెషలైజేషన్ డిపార్ట్ మెంట్ గాంధీ ఆస్పత్రిలో ఉందనే ఉద్ధేశంతోనే ప్రత్యేక అంబులెన్స్ లో రంగన్నను నేరుగా హైదరాబాద్ కు తరలించారు.
భారీ పోలీసు పహారా నడుమ రంగన్న తరలింపు కొనసాగింది. దాదాపు ఎనిమిది మంది పోలీసులు రంగన్న తరలింపులో ఉన్నారు. రంగన్నకు పోలీసులు ప్రత్యేక భద్రతా కల్పిస్తున్నారు. అర్ధరాత్రికి గాంధీ ఆస్పత్రికి చేరుకునే అవకాశం ఉంది. అయితే కేవలం మరింత మెరుగైన వైద్యం అందించడం కోసమే రంగన్నను హైదరాబాద్ కు తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
రంగన్న తిరుపతిలోని స్విమ్స్ లో చేరిన సమయానికి కొద్దిపాటి ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్నారు. అయితే, ఆయన ఆస్పత్రిలో చేరాక వెంటిలేటర్ ద్వారా ఆయనకు కృత్రిమ శ్వాస అందించే సదుపాయాన్ని కల్పించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగవ్వడం లేదన్న కారణంగా మెరుగైన చికిత్స హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
గాంధీ ఆస్పత్రిలో ఎక్స్ పర్ట్ పల్మనాలజిస్టులు ఉండటంతో అక్కడ ఆయనకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా తిరుపతిలోని స్విమ్స్ వద్ద కూడా రంగన్నకు ప్రత్యేక భద్రత కల్పించడం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి అన్ని వ్యవహారాలను బేరీజు వేసుకున్న నేపథ్యంలోనే పోలీసులు రంగన్నను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.