YS Viveka Case : వైఎస్ వివేకా లెటర్‌పై కూపీ లాగుతున్న సీబీఐ .. వివేకా పీఏ, ప్రకాశ్‌లపై ప్రశ్నల వర్షం
YS వివేకా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్. వైయస్ వివేక హత్య జరిగిన రోజు లెటర్ దాచి పెట్టడంపై ప్రకాష్ ను విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.

CBI Investigating on YS Viveka's Letter
YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Case )లో దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ (CBI) వివేకా లెటర్ గురించి కూపీ లాగుతోంది. దీనికి సంబంధించి వివేకా పీఏ కృష్ణారెడ్డి (Viveka PA Krishna Reddy), వివేకా ఇంటిలో వంటమనిషి కుమారుడు ప్రకాశ్ లను విచారిస్తోంది. లేఖ దాచి పెట్టిన విషయంలో ప్రకాశ్ పై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లేఖను దాచిపెట్టారని ప్రకాశ్ పై ఆరోపణలు వచ్చిన క్రమంలో సీబీఐ ప్రశ్నిస్తోంది. దీంతో ఈకేసులో మరిన్ని వివరాలను సేకరిస్తోంది సీబీఐ. మరి లేఖ విషయంలో వారి నుంచి లభ్యమైన వివరాలతో ఈకేసులో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకోనున్నాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దని విచారించిన తరువాత ఇంకెవరు సీబీఐ దృష్టిలో ఉన్నారు?ఇంకెవరైనా అరెస్ట్ లు జరుగుతాయా? అనే విషయంలో ఎప్పుడేం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
YS Viveka Case : దస్తగిరి ఇంటికెళ్లి మరీ భద్రత గురించి అడిగి తెలుసుకున్న సీబీఐ
వివేకా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్. వైయస్ వివేక హత్య జరిగిన రోజు లెటర్ దాచి పెట్టడంపై ప్రకాష్ ను విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. మంగళవారం (మే 2,2023) వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్న సీబీఐ ఈరోజు మరోసారి కృష్ణారెడ్డితో పాటు వంట మనిషి కొడుకు ప్రకాష్ లను విచారిస్తున్నారు.
కాగా ఈకేసులో కీలక నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (YCP MP Avinash Reddy )ని ఎప్పుడు అరెస్ట్ (Arrest) చేస్తారు? అనే విషయంపై కూడా ఆసక్తి కొనసాగుతోంది. ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ అప్పీలు చేసుకున్న సమయంలో అవినాశ్ ను అరెస్ట్ చేయటానికి దూకుడు ప్రదర్శించిన సీబీఐ ఆ తరువాత సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా..ఇప్పటి వరకు అవినాశ్ అరెస్ట్ కాకపోవటం వెనుక సీబీఐ వ్యూహం ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది.
YS Viveka Case : తప్పు చేశారు ఇక తప్పించుకోలేరు, అరెస్ట్ ఈ రోజో రేపో.. సిద్ధంగా ఉండు.. : బీటెక్ రవి