YS Viveka Case : దస్తగిరి ఇంటికెళ్లి మరీ భద్రత గురించి అడిగి తెలుసుకున్న సీబీఐ

బెయిల్ విచారణ వాయిదా పడటంతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందులకు చేరుకోవటంతో సీబీఐ అధికారులు కూడా పులివెందులకు వెళ్లారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికి చేరుకుని అతని భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు.

YS Viveka Case : దస్తగిరి ఇంటికెళ్లి మరీ భద్రత గురించి అడిగి తెలుసుకున్న సీబీఐ

CBI officials At Dastagiri's house.

Updated On : April 25, 2023 / 4:57 PM IST

YS Viveka Case :  పులివెందులలో దస్తగిరి ఇంటికి చేరుకున్నారు సీబీఐ అధికారులు. అతని ఇంటికి వెళ్లి మరీ అతని భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పలు కీలక విషయాలు సీబీఐ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. దస్తగిరి చెప్పిన వివరాల మేరకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి అతని తండ్రి భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేయటం..భాస్కర్ రెడ్డిని ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయటం దీంతో తనను కూడా అరెస్ట్ చేస్తారని భయంతో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్..దానిపై సుప్రీంకోర్టు షాక్ ఇవ్వవటం వంటి కీలక పరిణామాలు చకచకా జరిగిపోయాయి.

YS Viveka Case : అరెస్టుకా? విచారణకా? పులివెందుల ఇంటిలో అవినాశ్ రెడ్డి.. ఊరి వెలుపల కాపు కాసిన సీబీఐ..

ఈ క్రమంలో సీఎం జగన్ నుంచి అవినాశ్ రెడ్డిలతో తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తనకు భద్రత ఏర్పాటు చేయాలని దస్తగిరి కడప ఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో దస్తగిరికి భద్రత ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఈక్రమంలో అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు షాక్ ఇవ్వటం దానిపై హైకోర్టు తీర్పుని వాయిదా వేయటం అవినాశ్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకోవటంతో సీబీఐ అధికారులు కూడా పులివెందులకు చేరుకున్నారు.

అవినాశ్ రెడ్డి అన్ని రకాలుగా ఈ కేసులో ఇరుక్కుపోవటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏ క్షణమైన తన అరెస్ట్ జరుగుతుందని భావిస్తున్నారు. దీంట్లో భాగంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు సిద్ధమయ్యారు. అవినాశ్ రెడ్డి పులివెందులకు చేరుకోవటంతో దస్తగిరి భద్రత గురించి సీబీఐ అధికారులు అతని ఇంటికి వెళ్లి మరీ ఆరా తీశారు. కడప పోలీసులు కల్పించిన భద్రత ఎలా ఉంది? అని ఆరా తీశారు. భద్రత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బహుశా పులివెందులకు అవినాశ్ రెడ్డి చేరుకోవటం కారణం కావచ్చు అని సమాచారం.

YS Sunitha Reddy : వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ అంటూ పోస్టర్లు .. ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్