MLA Prakash Reddy: 20కోట్లు ఇవ్వు.. మొత్తం నీకే రాసిస్తాం.. చంద్రబాబుకు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Raptadu MLA
Raptadu MLA Topudurthi Prakash Reddy : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను 2వేల కోట్లు సంపాదించానంటూ ఆరోపించావ్.. నేను, నా భార్యపిల్లలు ఖాళీ ప్రాంసరీ నోట్ మీద సైన్ చేస్తాం. 20కోట్లు నాకు ఇవ్వు.. మా మొత్తం ఆస్తి నీకే రాసిస్తాం. అలాకాకుంటే.. ఆ 2వేల కోట్లతో తుంగభద్రకు సమాంతర కాల్వ నిర్మిద్దాం.. అంటూ చంద్రబాబు నాయుడుకు ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. సిగ్గులేని జన్మ చంద్రబాబుది.. పైగా పేదలకు సాయంచేసే నాపై విమర్శలా అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu: సీఎం జగన్‌కి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు.. ఆ తర్వాత..
హత్యా రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. మా ఆర్థిక మూలాలు దెబ్బతీశావ్. మమ్మల్ని లేకుండా చేయాలని చూశావ్ అంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంకి నీరు తెప్పించి.. 7వేల ఎకరాలకు సాగులోకి తెచ్చాం. కనీసం 50వేల ఎకరాల్ని సాగులోకి తెచ్చాం. మేము తోపులమే. నీ బెదిరింపులకు భయపడేది ఎవరూ లేరు.. ఎప్పుడో వదిలేసుకున్నాం. నన్ను బెదిరించే సీన్ నీకు లేదు.. నువ్వు జన్మలో ముఖ్యమంత్రి కాలేవ్ అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Chandrababu Naidu : పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు తీరని అన్యాయం జరిగింది- చంద్రబాబు తీవ్ర ఆవేదన
హెరిటేజ్ ద్వారా పాడి రైతుల రక్తాన్ని పీలుస్తున్నావ్. డైరీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి ఆర్థిక ఉగ్రవాదిగా మారావు. నేను సహకార డైరీ వ్యవస్థను పునరుజ్జీవం పోశాను. నెలకు వంద కోట్ల రూపాయల పాల రూపంలో దోపిడీ చేస్తున్న వ్యక్తివి నువ్వు. రైతుల శవాల మీద పడి బతికే వ్యక్తివి నువ్వు చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. జీడిపల్లి – పేరూరు కాల్వకు చంద్రబాబు నిధులు ఇవ్వలేదు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు సీఎం జగన్ ఆలోచన. దాన్ని కూడా కాపీ కొడుతున్నావ్.. నీకు మైండ్ పోయింది చంద్రబాబు. నా మీద పరిటాల సునీత రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావ్. ఈ ఆరు నెలల్లో అన్నీ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతాం. వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తాం. ఎమర్జెన్సీ ప్రాజెక్టులకు మాత్రమే ఇప్పుడు నిధులు ఇస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు.