29 ఏళ్ల తరువాత..! కూటమి శాసనసభాపక్ష సమావేశంలో అరుదైన ఘటన..

ఎన్టీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కూటమి పార్టీలు అంతా సమానమే అనే సంకేతాలు చంద్రబాబు ఇచ్చారు.

29 ఏళ్ల తరువాత..! కూటమి శాసనసభాపక్ష సమావేశంలో అరుదైన ఘటన..

NDA Alliance legislative party meeting

NDA Alliance : ఏపీలో ఎన్టీయే కూటమి శాసనసభా పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడ ఏ కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష నేత ఎంపిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పవన్ ప్రతిపాదనను బలపర్చగా.. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. తాజా పరిణామాలతో 1995 ఘటనను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

Also Read : ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పా: చంద్రబాబు

కూటమి శాసనసభాపక్ష సమావేశంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1995లో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశంలో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రతిపాదించారు. 29ఏళ్ల తర్వాత జరిగిన కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య దగ్గుబాటి పురంధేశ్వరి బలపర్చారు. ఈ సందర్భంగా 1995 నాటి పరిణామాలను టీడీపీ నేతలు గుర్తుసుకుంటున్నారు.

Also Read : Pawan Kalyan : చంద్రబాబు చేతిలో చెయ్యేసి పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం ..

ఇదిలాఉంటే.. ఎన్టీయే శాసనసభాపక్ష సమావేశంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో కూటమి పార్టీలు అంతా సమానమే అనే సంకేతాలు చంద్రబాబు ఇచ్చారు. వేదికపై సిబ్బంది తనకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీని చంద్రబాబు తొలగించాలని ఆదేశించారు. అందరితో సమానమైన కుర్చీ తీసుకురమ్మని సూచించారు. కూటమి అధినేతలు కూర్చున్న కుర్చీ తెప్పించుకొని అందరితో కలిసి చంద్రబాబు కూర్చున్నారు. కూటమి పార్టీలు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని తన చర్యలు ద్వారా చంద్రబాబు నాయుడు సందేశం పంపినట్లయింది. ఇది మంచి పరిణామం అంటూ కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.