రక్షణ లేదా : మృతదేహం కళ్లను తినేసిన ఎలుకలు

ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటున్నాయో, సిబ్బంది నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఈ ఘటన చూపిస్తోంది. ఆస్పత్రిలో ఎలుకలు మృతదేహం కనుగుడ్లు, రెప్పలు తినేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును ఎలుకలు కొరికి చంపిన ఘటన గుర్తుకు తెచ్చింది. దీనిపై మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
వైకుంఠ వాసు అనారోగ్యంతో చనిపోయాడు. పోస్టుమార్టం నిమిత్తం…డెడ్ బాడీని మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాన్ని తీసుకోవడానికి 2020, జనవరి 30వ తేదీ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. డెడ్ బాడీకి కళ్లు లేకపోవడంతో షాక్ తిన్నారు. అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. బాక్సులో పెట్టకుండా..బయటే పెట్టడంతో ఎలుకలు అతని కళ్లను తినేశాయని గుర్తించారు.
దీనిపై మృతుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చురీ ఆవరణలో కుక్కలు, ఎలుకలు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. మార్చురీకి సంబంధించి ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చారని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. ప్రభుత్వ సూపరిటెండెంట్ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Read More : GN RAO కమిటీ రిపోర్టుపై అబద్దపు ప్రచారాలు – రోజా