Reliance In AP : ఏపీలో రిలయన్స్ 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడి.. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే..
గుజరాత్ తర్వాత రిలయన్స్ వేరే రాష్ట్రంలో ఈ రేంజ్ లో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Reliance Investment In AP (Photo Credit : Google)
Reliance In AP : ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ముందుకొచ్చింది. క్లీన్ ఎనర్జీలో దాదాపు రూ.65 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ ఎంవోయూ సైతం కుదుర్చుకోనుంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ అనంత్ అంబానీ చర్చలు సైతం జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా ఏపీలో సుమారు 2.50 లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది.
గుజరాత్ తర్వాత రిలయన్స్ వేరే రాష్ట్రంలో ఈ రేంజ్ లో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రమంతటా సుమారు 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా సుమారు 2.50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఎంవోయూ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తైంది. మంత్రి నారా లోకేశ్ ఇటీవల రిలయన్స్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సుముఖుత వ్యక్తం చేసింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో దాదాపు 65వేల కోట్ల రూపాయలను ఏపీలో పెట్టుబడిగా పెడతామంది. దీని ద్వారా 2.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది.
గుజరాత్ రాష్ట్రం తర్వాత మరెక్కడా కూడా రిలయన్స్ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన పరిస్థితులు లేవు. గుజరాత్ తర్వాత ఏపీలో రిలయన్స్ దాదాపు 65వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. ఈ భారీ ఇన్వెస్ట్ మెంట్ తో ఏపీ రూపురేఖలన్నీ మారతాయనే అంచనా వేస్తోంది ప్రభుత్వం.
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ లో భాగంగా రాష్ట్రంలో 25 లక్షల ఉద్యోగాల కల్పన చేపడతామని ఎన్డీయే కూటమి తమ మ్యానిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో.. రిలయన్స్ పెట్టుబడులతో ఏపీలో 2.50 లక్షల మంది ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఎంవోయూపై విజయవాడ కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రిలయన్స్ ప్రతినిధి అనంత్ అంబానీలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని పాలకులు అంటున్నారు. ఇప్పటికే పరిశ్రమలకు సంబంధించి కొత్త పరిశ్రామిక విధానాన్ని ప్రకటించింది చంద్రబాబు సర్కార్. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనేక రకాల రాయితీలు, అనుమతులు మంజూరు చేస్తామని.. ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తామని, జీఎస్టీ సహా ట్యాక్సుల విషయంలో ఎంత మేర తగ్గించగలిగితే అంతమేర తగ్గిస్తామని, ఇతరత్రా రాయితీలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దేశ విదేశీ సంస్థలు కూడా ఏపీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ప్రాంతంలో అతి విలువైన భూములను వచ్చే సంస్థలకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.