Perni Nani: ఆ కేసులో మాజీమంత్రి పేర్ని నాని, అనిల్ కుమార్‌లకు హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు..
పేర్ని నాని తరపున సీనియర్ కౌన్సిల్ శ్రీరఘు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు.

Perni Nani: వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వారిద్దరిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పామర్రు సభలో రప్పా రప్పా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పేర్నినాని, కైలే అనిల్ కుమార్ పై కేసు నమోదైంది. ఈ కేసులో వారు హైకోర్టును ఆశ్రయించారు. పేర్ని నాని తరపున సీనియర్ కౌన్సిల్ శ్రీరఘు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు.
ఈ నెల 8న పామర్రులో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రప్పా రప్పా అని చెప్పడం కాదు.. రాత్రికి రాత్రి చేసేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పేర్ని నాని మాట్లాడారని ఆరోపిస్తూ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.
Also Read: చంద్రబాబుతోనే శభాష్ అనిపించుకుంటున్న కోటంరెడ్డి.. మంత్రిపదవి రేసులో పేరు.. విస్తరణలో అవకాశం? కానీ..
ఆ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో పేర్ని నాని అలర్ట్ అయ్యారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పామర్రు కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు తదుపరి విచారణను జులై 22కి వాయిదా వేసింది. ఈ క్రమంలో పేర్నినాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.