NPRపై కేంద్రానికి సీఎం జగన్ ట్వీట్ రిక్వెస్ట్

NPRపై కేంద్రానికి సీఎం జగన్ ట్వీట్ రిక్వెస్ట్

Updated On : March 3, 2020 / 12:05 PM IST

యావత్ దేశం మొత్తం CAA, NRC, NPR గురించి ఆందోళనలు జరుగుతున్నాయి. కొద్ది రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. ససేమిరా అమలు చేయమని మొండికేశారు బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాల సీఎంలు. ఈ సమస్యపై ఏపీ సీఎం జగన్ కూడా నోరు విప్పారు. సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా కేంద్రానికి వినతి ఇచ్చారు. 

‘మా రాష్ట్రంలోని కొందరు మైనారిటీల్లో NPRపై సందేహాలు మొదలయ్యాయి. అభద్రతాభావం క్రియేట్ అయింది. మా పార్టీలో నేతలంతా చర్చించాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నాం. 2010 ప్రకారమే జనాభా లెక్కలను అనుసరించాలని  రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని ప్రభావం కారణంగా రాబోయే అసెంబ్లీ సెషన్‌లో రిసొల్యూషన్‌ను ప్రవేశపెడతాం’ అనేది ట్వీట్ సారాంశం.

 

 

పౌరసత్వ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ఈ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి తేల్చి చెప్పారు. ఈ చట్టాన్ని అమలుచేయని తృణముల్ ప్రభుత్వాన్నికేంద్రం రద్దు చేయాలనుకుంటే చేసుకోవచ్చని మమత సవాల్‌ విసిరారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ .. ‘దేశంలో ఏం జరుగుతుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. జర్మనీలో ఏం జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. ముందు కమ్యూనిస్టులపై ఆ తర్వాత యూదులను చంపారు. మాట్లాడటానికి ఇదే సరైన సమయం. పేద ప్రజలు బర్త్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోగలరు. ఇది చాలా విషాదకరం. నా జీవితకాలంలో ఇలాంటివి ఇక్కడి ఉండగా చూస్తాననుకోలేదు. సోదరభావాన్ని ముక్కలు చేస్తున్నారు మీరు’ అని వెల్లడించారు.