Cows In Velugodu Reservoir : టెన్ టీవీ ఎఫెక్ట్.. వెలుగోడు రిజర్వాయర్‌లో కొట్టుకుపోయిన ఆవులను కాపాడేందుకు చర్యలు
ఎట్టకేలకు వెలుగోడు ప్రాజెక్ట్ అధికారులు మొద్దు నిద్ర వీడారు. వెలుగోడు ప్రాజెక్ట్ లో గల్లంతైన ఆవులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వెలుగోడు రిజర్వాయర్ లో 150 గోవుల గల్లంతు కావడంపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.

Cows In Velugodu Reservoir
Cows In Velugodu Reservoir : ఎట్టకేలకు వెలుగోడు ప్రాజెక్ట్ అధికారులు మొద్దు నిద్ర వీడారు. వెలుగోడు ప్రాజెక్ట్ లో గల్లంతైన ఆవులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వెలుగోడు రిజర్వాయర్ లో 150 గోవుల గల్లంతు కావడంపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. మూగజీవాల కోసం వాటి యజమానులు పడుతున్న వ్యథను కళ్లకు కట్టింది. 500 గోవులు ప్రాజెక్ట్ లో గల్లంతు కాగా, 350 ఆవులను మత్స్యకారులు కాపాడారు. మరో 150 ఆవులు గల్లంతయ్యాయి.
Nandyala: ఆవుల మందను తరిమిన అడవిపందుల గుంపు..భయంతో రిజర్వాయర్ లో చిక్కుకున్న గోమాతలు
ఉదయం ఘటన జరిగినా.. సాయంత్రం వరకు ప్రాజెక్ట్ అధికారులు పట్టించుకోలేదు. టెన్ టీవీ వరుస కథనాలతో ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడారు. ముందుగా ప్రాజెక్ట్ లోకి వచ్చే ఇన్ ఫ్లోని తగ్గించారు. పోతిరెడ్డిపాడు రెగులేటర్ వద్ద వాటర్ ఇన్ ఫ్లోని తగ్గించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు సాయంతో రిజర్వాయర్ లో గాలింపు ప్రారంభించారు. వెలుగోడు చేరుకున్న ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ సమీపంలో మేతకు వెళ్లిన ఆవుల గుంపును అడవి పందులు వెంటపడి తరిమాయి. దీంతో భయపడిన ఆవులు వాటి నుంచి తప్పించుకునేందుకు వెలుగోడు జలాశయంలోకి దిగాయి. అసలే వర్షాలు.. జలాశయం నిండుగా ఉంది. దీంతో నీటి ప్రవాహానికి 500 ఆవులు కొట్టుకుపోతుండగా.. గమనించిన మత్స్యకారులు, స్థానికులు వెంటనే స్పందించారు. 350 గోవులను రక్షించారు. ఇంకా 150 గోమాతలు గల్లంతయ్యాయి. వాటి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.