Road Accident: అనంతపురంలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి!
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా..

Bus Accident
Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో 15 మందికి గాయాలయ్యాయి. అనంతపురం-పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఈ ప్రమాదం సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణిస్తున్నట్లు తెలియగా.. గాయపడిన వారిని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Anantapuram Road Accident : అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం… వలస కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు కాస్త ఆలస్యమవగా.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారణ చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వలనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమిక అంచనాగా తెలుస్తుంది.